- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఓటుకు రూ.6 వేల వరకు పెంచేస్తున్నారు’
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధమవుతోందని, కొంతమంది ఓటుకు రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు రేటు పెంచేస్తున్నారంటూ టీజేఎస్ అభ్యర్థి, ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఫలాలను ఒక్క కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్య, నియంతృత్వ, జవాబు దారీతనంలేని పాలన సాగుతోందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు వివేకంతో ఆలోచిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తన ప్రచారంలో అనేక మంది నిరుద్యోగులు, ఉద్యోగులు తమ బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. ఇదికాదు తెలంగాణ ప్రజలు ఆశించిన పాలన, ఇలాంటి పాలకుల చేతిలో తెలంగాణ ఉన్నందుకు ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ కాంట్రాక్టులు, యూనివర్సిటీలకు ఆగమేఘాల మీద అనుమతులు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం తప్పులు చెబుతోందని, ప్రజలు ప్రభుత్వ పెద్దల మాటలను విశ్వసించే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.