అప్పుడు కేసీఆర్‌ను చూసి నవ్వారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Kodada MLA Bollam Mallaiah Yadav
X

దిశ, కోదాడ: దళితుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్‌లో దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం పాల్గొని మాట్లాడుతూ.. తరతరాలుగా అణచి వేయబడిన దళిత జాతిలో సరికొత్త విప్లవానికి ‘దళితబంధు’ నాంది పలుకుతుందని అన్నారు. ‘దళితబంధు’ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందని అన్నారు. నాడు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తామంటే నవ్వారని, కానీ, ఇప్పుడు పొరపాటున కూడా కరెంట్ పోకుండా ఉంటోందని తెలిపారు. ‘దళితబంధు’ పథకాన్ని కూడా రైతుబంధు మాదిరి అందరికీ అందిస్తామని తెలిపారు.

దళిత మేధావులు, నేతలు, కవులు, యువత, ఉద్యోగులు అందరూ ఈ పథకం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జెడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, వైస్ ఎంపీపీ బడేటి చంద్రయ్య, దళిత సర్పంచులు యాతాకుల వీరస్వామి, స్వరూప వెంకన్న, నాగేశ్వరరావు ఎంపీటీసీ గోలి సునీత, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్, ఉద్యోగుల సంఘం నాయకులు దున్న శ్యామ్, జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు ఈదయ్య, టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షులు దాసరి శ్రీను, మాజీ సర్పంచులు సుధాకర్, నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు, దేవభత్తని సురేష్, పాలడుగు ప్రసాద్, ఆంజనేయులు, వెంకన్న, సంపేట ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed