మత్స్య శాఖలో రూ.3 వేల డ్రైఫ్రూట్స్ తిన్న మంత్రి

by Shyam |   ( Updated:2021-12-03 11:30:28.0  )
మత్స్య శాఖలో రూ.3 వేల డ్రైఫ్రూట్స్ తిన్న మంత్రి
X

దిశ,కోదాడ: కోదాడ మత్స్యశాఖ సహకార సంఘం నిర్వాహకులు తప్పుడు లెక్కలను చూపుతున్నారని ఆ సంఘం సభ్యులే మండిపడ్డారు. కోదాడ, ఖానాపురం, వెంకట్రాంపురం గ్రామాలను కలిపి 550కు పైగా సభ్యులు కలిగిన కోదాడ పెద్ద చెరువు పై గత సంవత్సరం సుమారు 27 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. అయినా తప్పుడు లెక్కలు చూపించి సంఘం సభ్యులను మోసం చేస్తున్నారని సభ్యులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గత సంవత్సరం కోదాడ పెద్ద చెరువులో చేప పిల్లలు పోసేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డ్రై ఫ్రూట్స్ అందజేసినందుకు రూ.3000, ఫ్లెక్సీలు కట్టినందుకు రూ.9000 రికార్డుల్లో ఖర్చు చూపించారు.

నూతనంగా ఎన్నికైన మత్స్యశాఖ సహకార సంఘం మూడు విడతలుగా చెరువు చేపలను విక్రయించింది. జాలర్లకు దినసరి కూలీ చెల్లించి చేపలను అమ్మగా వచ్చిన సొమ్మును కమిటీ సభ్యులకు పంపకాలు చేయాలి. కానీ అధ్యక్షులు, కార్యదర్శి, తొమ్మిదిమంది డైరెక్టర్ల కమిటీ వాళ్లే సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలను కాజేసి తప్పుడు లెక్కలు చుపెడుతున్నారని సభ్యులు ఆరోపించారు. మత్స్య శాఖ అధ్యక్షులు కందరబోయిన వీరస్వామి,కార్యదర్శి ఐతబోయిన వెంకటేశ్వర్లు ఇరువురు కలిసి అవినీతికి పాల్పడినట్లు ప్రధానంగా ఆరోపించారు. నూతనంగా చెరువు సభ్యత్వం పొందాలంటే ప్రభుత్వం విధించిన రుసుము కంటే అధికంగా 6,000 నుంచి 10,000లకు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed