స్నాక్స్: కొబ్బరి గారెలు

by Shyam |
స్నాక్స్: కొబ్బరి గారెలు
X

కావాల్సిన పదార్థాలు

బియ్యం పిండి -1 కప్పు
పచ్చికొబ్బరి తురుము -1/2 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి -4
జీలకర్ర -1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీ స్పూన్
పసుపు -పావు టీస్పూన్
వేడి నీళ్లు -తగినన్ని
ఉప్పు -రుచికి తగినంత
నూనె -వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా మిక్సిలో పచ్చికొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకుని అందులో కొబ్బరి తురుము పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకుని కలుపుకోవాలి. తర్వాత వాటిలో వేడినీళ్లు కొద్దికొద్దిగా చేర్చుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పోలిథిన్ షీట్ మీద కొద్దిగా నూనె పోసి.. నూనెతో తడి చేసుకున్న చేత్తో పిండి ముద్దను చెక్కల మాదిరి వత్తుకోవాలి. లేదంటే పూరి ప్రెస్‌లో కూడా వత్తుకోవచ్చు. తర్వాత దీనిని వేడి వేడి నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే కొబ్బరి గారెలు రెడీ..

Advertisement

Next Story