Ind Vs SA Test : రికార్డు బద్దలుకొట్టిన కేఎల్ రాహుల్..

by Anukaran |   ( Updated:2021-12-26 21:17:18.0  )
Ind Vs SA Test : రికార్డు బద్దలుకొట్టిన కేఎల్ రాహుల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఫస్టు టెస్టులో మొదటి రోజును టీమిండియా ఘనంగా ముగించింది. ఓపెనర్లు జట్టుకు మంచి శుభారంభం అందించారు. కేఎల్ రాహుల్(122) నాటౌట్, మయాంక్ అగర్వాల్ (60) పరుగులు చేసిన సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 272/3 స్కోరు చేసింది. రాహుల్‌తో రహానే (40) నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు.

అయితే, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ టెస్టు సెంచరీ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన రెండో ఓపెనర్‌గా రాహుల్​రికార్డుకెక్కాడు. అంతకుముందు వసీమ్ జాఫర్​2006-07లో జరిగిన ఓ టెస్ట్​మ్యాచ్‌లో 116 పరుగులు సాధించాడు. అయితే, టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో రాహుల్ అత్యధిక స్కోర్ 199 పరుగులు కాగా.. ప్రస్తుతం రాహుల్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ టెస్టులో రాహుల్ డబుల్ సెంచరీ బాదాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed