సుశాంత్ డెత్ రిపోర్ట్‌లో టైమ్ మిస్సింగ్

by Jakkula Samataha |
సుశాంత్ డెత్ రిపోర్ట్‌లో టైమ్ మిస్సింగ్
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పలు అనుమానాల్ని లేవనెత్తుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్, లాయర్ వికాస్ సింగ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. డెత్ రిపోర్ట్‌లో సుశాంత్ ఎప్పుడు చనిపోయాడన్న విషయాన్ని మెన్షన్ చేయలేదని చెప్పాడు. ఇది చాలా కీలకమైన సమాచారమని.. సుశాంత్ ఉరేసుకుని చనిపోయాడా? లేక చనిపోయాక ఉరి వేశారా? అనేది డెత్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని అన్నారు.

ముంబై పోలీసులు.. సుశాంత్ కేసులో ఇన్వెస్టిగేషన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇందులోకి రాజకీయ నాయకులు ఎంటర్ కావడం వల్ల వారి ఒత్తిళ్లకు లొంగిపోయి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డెత్ రిపోర్ట్‌పై ముంబై పోలీసులు, కూపర్ ఆస్పత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని.. నిజానిజాలు తేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story