- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డ్ బ్రేకింగ్ KISS.. ముద్దు వలన కలిగే లాభాలు, క్రేజీ ఫ్యాక్ట్స్ మీకోసం..
దిశ, వెబ్‌డెస్క్ : KISS.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతటి బలమైన రిలేషన్ ఉందో తెలిపే ఓ కమ్యూనికేషన్.. అంతేకాకుండా ఒకరి మీద ఉన్న ఇష్టాన్ని నేరుగా చెప్పలేనప్పుడు ‘కిస్’ చేయడం వల్ల కూడా వాళ్లను మనం ఎంతగా ఇష్టపడుతున్నామో తెలియజేయవచ్చని రిలేషన్‌లో ఉన్న వారి అభిప్రాయం. కపుల్స్ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారో తమ భాగస్వామికి తెలియజేసే ఓ ఫీలింగ్ కిస్.. KISS అనేది ఓ అందమైన అనుభూతి. ఇది ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గానూ వ్యక్తులను స్ట్రాంగ్‌గా ఉండేందుకు దోహదపడే ఓ సాధనం. ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వలన వారిలో ఉండే ఒత్తిడిని జయించే అవకాశం ఏర్పడుతుంది. కిస్ చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు కేలరీస్ కరగడంలోనూ దోహదపడుతుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య గల ప్రేమ, కేరింగ్‌ను ఒకరినొకరికి తెలిపేందుకు డీప్ కిస్(Deep kiss) ఉపయోగపడుతుంది. ఒక్క కిస్‌తో బంధం బలపడే చాన్స్ ఉంది. అందుకోసమే June-22ను అమెరికాలో జాతీయ ముద్దు దినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. అయితే, బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ముద్దులు పెట్టుకునే సంస్కృతి ఇండియాలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే కనిపిస్తుంది. మనదేశంలో కొన్ని చోట్ల ఓపెన్‌గా ముద్దు గురించి మాట్లాడేందుకు, బహిరంగంగా పెట్టుకునేందుకు చాలా మంది సంకోచిస్తారు. మాట్లాడితే తమ గురించి తప్పుగా అనుకుంటామనే భావన అటు అమ్మాయిల్లోనూ ఇటు అబ్బాయిల్లోనూ ఉంది. ఇటీవల ఇండియాలోనూ విదేశీ కల్చర్ పెరుగుతుండటంతో KISS గురించి ఇక్కడి యువతలో ‘తప్పు’ అనే భావన తొలగిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలోని మెట్రో నగరాలు, బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ నేటి యువత అక్కడక్కడా దర్శనమిస్తున్నారు. అయితే, ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే.. (Kiss) తప్పు అనే భావన తొలగిపోయే చాన్స్ లేకపోలేదు.
KISSNG DAY సెలబ్రేషన్ ఎక్కడ మొదలైంది..
‘కిస్సింగ్ డే సెలబ్రేషన్’ కాన్సెప్ట్ అనేది మొదట యునైటైడ్ కింగ్ డమ్‌లో ప్రారంభమై ఆ తర్వాత అమెరికా, ప్రపంచ దేశాలకు విస్తరించింది. 2000 సంవత్సరం నుంచే కిస్సింగ్ డే సెలబ్రేషన్ జరుపుతున్నా.. అప్పటివరకు దీని గురించి ఎవరికీ తెలీదు. అయితే, అంతర్జాతీయ ముద్దు దినోత్సవం (International kissing Day)ను మాత్రం జూన్ 6న జరుపుకుంటారు.
కిస్సింగ్ గురించి క్రేజీ ఫ్యాక్ట్స్..
1. మీ భాగస్వామిని 1మినిట్ ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో 26 కెలోరీస్ కరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, రోజు ముద్దు పెట్టుకోవడంతో పాటు ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తే మీ ‘లైఫ్ స్పాన్’ కూడా పెరిగే చాన్స్ ఉంది.
2. డీప్‌గా మద్దు పెట్టుకునే క్రమంలో వచ్చే లాలాజలం(saliva)వలన దంత, నోటి సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది.
3. యావరేజ్‌గా జనాలు 336 గంటలు ముద్దులు పెట్టుకునేందుకు సమయం కేటాయిస్తారు. ( దాని విలువ మన జీవితంలో రెండు వారాలు)
4. 1996లో ఇద్దరు విభిన్న జాతులకు చెందిన ప్రజలు ముద్దు పెట్టుకున్న సీన్ ‘స్టార్ ట్రెక్’ అనే ఎపిసోడ్ ద్వారా టెలివిజన్‌లో ప్రసారమైంది.
5. లాటిన్ అమెరికా దేశంలో సాధారణంగా ఎవరినైనా ముద్దుతో ఆహ్వానిస్తారు. ఫ్రాన్స్‌లో అయితే తమ ఇష్టాలను కిస్ తోనే వ్యక్తపరుస్తారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో తమ అధినాయకుడు నడిచిన గ్రౌండ్‌ను ముద్దాడుతుంటారు. ఇటాలియన్స్ మాత్రం ఇతరులను పలకరించేటప్పుడు చేతిని ముద్దాడుతూ హలో చెప్తారు.
6. 2010 సంవత్సరంలో (ఎలెనా అన్‌డన్) పిక్చర్‌లో నటులు నెకర్ జేడ్‌గన్ మరియు ట్రెసీ డిన్విడ్డిలు 3 నిమిషాల 23సెకన్ల పాటు ముద్దు పెట్టుకుని రికార్డులు క్రియేట్ చేశారు. కాగా, ప్రపంచంలోనే లాంగెస్ట్ KISS రికార్డు థాయ్ కపుల్ ‘ఎక్కాచ్ అండ్ లాక్సానా తిరన్ రాత్’ పేరు మీద నమోదైంది. వీరు ముద్దు పెట్టుకున్న సమయం 58గంటల 35 నిమిషాల 58 సెకండ్లు.