- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
corona pandemic : ఈ సమయంలో ముద్దులు వద్దు..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా(corona pandemic) కొన్ని కఠిన నియమాలను తీసుకొచ్చింది. ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం విషయంలో పెను మార్పులకు నాంది పలికింది. అక్షర జ్ఞానం లేని వాళ్ల నుంచి అపర కుబేరుడు వరకు ఓకే నిబంధనలు పాటించేలా చేసింది. అయితే ఏడాదికి పైగా కరోనా మనతో సహజీవనం చేస్తోంది. ఈ సమయంలో సెక్స్‌పై, ముద్దులపై సందేహాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు సెక్స్ (Sex) చేసుకున్న జంటలపై చేసిన పరిశోధనల్లో మగవారి వీర్యం గానీ, ఆడవారి వజైనల్ ఫ్లూయిడ్స్ నుంచి కరోనా వచ్చిన దాఖలాలు చాలా తక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో దంపతులు అయినా కండోమ్ (Condom), ఫేస్ మాస్క్ వాడడం మంచిదని సూచిస్తున్నారు. చుంబనాలకు దూరంగా ఉండాలంటున్నారు. అపరిచితులతో అసలు సెక్సే వద్దని హెచ్చరిస్తున్నారు.
స్నేహితులను, బంధువులను కలిసినప్పుడు హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం ప్రస్తుత సమాజంలో పెరిగిపోయాయి. పట్టణ, నగరాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. లవర్స్ సైతం తరుచూ ముద్దులు (kissing) పెట్టుకోవడం సహజమే. అయితే ఈ కరోనా సమయంలో ముద్దులు పెట్టుకోవడం డేంజరేనని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చినా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ఎవరికి కరోనా ఉన్నదో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో భార్యభర్తలు కూడా ముద్దులు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా ఇవ్వొద్దంటున్నారు. లవర్స్ పెట్టుకునే లిప్ కిస్ లు మరీ డేంబర్ అని వివరిస్తున్నారు. సో.. కరోనా కాలంలో ముద్దులకు దూరంగా ఉండడమే బెటర్.