- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి.. మంత్రి కిషన్ రెడ్డి
by Shyam |

X
దిశ, అంబర్ పేట్: యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట్‌లోని మున్సిపల్ గ్రౌండ్స్‌లో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన దేశ భక్తుల చిత్ర ప్రదర్శనను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహనీయులను గుర్తుచేసుకోవడం సంతోషదాయకమన్నారు. అద్భుతమైన చిత్రాలను సమూహంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు పద్మ వెంకట్ రెడ్డి, అమృత, కన్నె ఉమా రాణి, బి. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story