Union Minister Kishan Reddy: బ్లాక్ ఫంగస్‌కు మందులు సమకూరుస్తాం: కిషన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-05-27 03:31:57.0  )
Kishanreddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సకు అంఫొటరిసిన్ మందులను ఈ నెలాఖరుకి 3 లక్షలు, వచ్చే నెల మరో 3 లక్షలు కేంద్రం నుంచి అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కోటి ఈ ఎన్ టి, నిమ్స్ ఆసుపత్రిలో ఆయన పర్యటన చేసి ఏర్పాట్లను పరిశీలించారు. మన దేశంలోని 11 కంపెనీలు బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతాయని తెలిపారు. వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుందని, అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలని సూచించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా, బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి తెలిపారు.

జూడాల కోరికలు న్యాయమైనవని, ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చెప్పారు. కరోనా తగ్గిన దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఫంగస్ వస్తుందని, వారిని ఇంట్లోనే పెట్టుకొని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. దేశంలో ఆక్సిజన్ ,బెడ్స్ కొరత లేదని చెప్పుకొచ్చారు. వాక్సిన్, ఇంజక్షన్లను ఆసుపత్రులు, ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోవచ్చని, ఇందుకు 24 గంటల్లో కేంద్రం ఆమోదం ఇస్తుందని చెప్పారు. మీడియా కూడా ప్రజలను బయపెట్టకుండా కోవిడ్ జయించిన వారి కధనాలు ప్రసారం చేయాలని సూచించారు. 125 బెడ్ల సామర్థ్యం ఉన్న ఈ ఎన్ టి 250 మందికి పైగా వైద్యం అందిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed