- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూపర్‌స్టార్ బర్త్‌డే రోజే నరికేశారు.. ఫ్యాన్స్ ఇలా చేశారేంటి..?
దిశ, వెబ్‌డెస్క్: సినీ అభిమానుల ఆనందానికి ఈ మధ్య అవధులు లేకుండా పోతున్నాయి. ఇది కాస్తా మితిమీరడంతో సూపర్‌స్టార్‌లు సైతం విమర్శల పాలు అవుతున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అంటూ నెటిజన్లు డోస్ ఎక్కువే ఇస్తున్నారు.
తాజాగా ఫ్యాన్స్ చేసిన పనికి కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సూపర్ స్టార్ జన్మదిన వేడుకలు కర్ణాటకలోని బళ్లారిలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. కానీ, బర్త్ డే వేడుకలో జరిగిన హింస సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బళ్లారిలోని ఓ థియేటర్‌లో సుదీప్ భారీ కటౌట్ ఎదుట.. రెండు సింహలు ఉన్న పోస్టర్ మధ్యలో దున్నపోతును కట్టేసి నరికిచంపారు అభిమానులు.. తమ అభిమాన నటుడికి బలి ఇచ్చామంటూ సంబురాలు చేసుకున్నారు.
ఇది కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో నెటిజన్లు, ముఖ్యంగా జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సెలబ్రిటీల పుట్టినరోజు అయితే జంతువులను బలి చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం.