- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్ దివా.. క్లారిటీ దియా!
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. భరత్ అను నేనుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ… తర్వాత వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ చవి చూసింది. దీంతో టాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా పూర్తిగా బాలీవుడ్‌పై కాన్సంట్రేట్ చేసింది ఇప్పటివరకు. కానీ, మళ్లీ మహేష్‌బాబు సినిమాలోనే నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహేష్ మూవీ హీరోయిన్‌గా సైన్ చేసిందట. కబీర్ సింగ్, గుడ్ న్యూజ్ సినిమాల హిట్‌తో మాంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌కు హిందీలోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
అయితే ఈ బాలీవుడ్ దివా… హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందనే రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. బ్రైడ్స్ టుడే మ్యాగ్జిన్‌కు ఫోజులిచ్చిన భామ… ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర విషయాలు మాట్లాడింది. నేనెవరితో ప్రేమలో లేనని క్లారిటీ ఇచ్చింది. రిలేషన్ షిప్‌లో ఉంటే ఒక బౌండరీ గీసుకున్నట్లే అంటోంది. ఒక వేళ రిలేషన్ షిప్‌లో ఉంటే ఎందరి ముందైనా ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నాను అని చెప్పేందుకు భయపడకుండా ఉండాలని సూచిస్తోంది. పార్ట్‌నర్‌ను అన్ని విధాల అర్థం చేసుకోవాలన్న కియారా…. కాబోయే భర్తతో డేటింగ్‌లో ఉంటే తప్పేమీ లేదని చెబుతోంది. భర్తతో గడిపిన కాలాన్ని తల్లి దగ్గర ఓపెన్‌గా షేర్ చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడాలని అభిప్రాయపడుతోంది.