పబ్లిక్‌గా కనిపిస్తే వెంటపడుతున్నారు.. ఎలా ఉన్నా కష్టమే : కియారా

by Shyam |
పబ్లిక్‌గా కనిపిస్తే వెంటపడుతున్నారు.. ఎలా ఉన్నా కష్టమే : కియారా
X

దిశ, సినిమా: తెలుగులో మహేశ్, రాంచరణ్ సరసన నటించిన కియారా అద్వానీ.. ‘కబీర్ సింగ్’ మూవీతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతానికి పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న భామ.. రీసెంట్ ఇంటర్వ్యూలో నెటిజన్ల ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని సందర్భాల్లో తను కూడా ట్రోలింగ్‌కు గురైనప్పటికీ వాటిపై స్పందించకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది. ‘మేము ఎక్కడ కనిపించినా వెంటపడి మరీ ఫొటోలు, వీడియోలు తీసే మీడియా పర్సన్స్.. వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. ఇక సదరు ఫొటోల్లో ఏదో కారణాన్ని వెతికి ట్రోలింగ్ మొదలుపెట్టే నెటిజన్లు.. ఆ దుస్తులు ఎందుకు వేసుకున్నారు? ఎందుకలా నడుస్తున్నారు? ఎందుకలా నిలబడ్డారు? అంటూ చర్చకు దిగి ఇబ్బందులకు గురిచేస్తారు’ అని చెప్పింది.

ఇదే క్రమంలో ఓసారి మీటింగ్‌కు వెళ్లే తొందరలో ఉన్న తాను ఫొటోగ్రాఫర్లకు పోజివ్వని విషయం గుర్తు చేసుకుంది. అయితే అదే వీడియోను కొందరు నెట్టింట పోస్ట్ చేయడంతో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో దాడి చేశారని చెప్పింది.

Advertisement

Next Story