ప్రభాస్ సరసన కియారా ?

by Shyam |
ప్రభాస్ సరసన కియారా ?
X

ప్రభాస్… పాన్ ఇండియా స్టార్. బాహుబలితో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు డార్లింగ్ అయిపోయాడు. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ మూవీ చేస్తున్న ప్రభాస్… తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 ఎండింగ్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.

ప్రభాస్ కు ఇది 21వ సినిమా కాగా… ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని డార్లింగ్ కు జోడిగా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. సినిమాలో కియారాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా కియారా ఇంతకు ముందు తెలుగులో భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఈ మధ్య కియారా తెలుగు సినిమాలు ఒప్పుకోవడం లేదని వార్తలు రాగా… తనకు నచ్చిన పాత్ర వస్తే భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఒప్పుకుంటాను అని చెప్పింది. బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తున్న కియారా… వెబ్ సిరీస్ లోనూ దూసుకుపోతుంది.

Tags: Kiara Advani, Bollywood, Prabhas, Nag Ashwin, Vyjayanthi Movies

Advertisement

Next Story