ఐ యామ్ సింగిల్ : కియార

by Shyam |
ఐ యామ్ సింగిల్ : కియార
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా కియారా అద్వానీ, స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలాసార్లు వీరిద్దరూ జంటగా కనిపించగా.. ఈ పెయిర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు వీళ్లు రియల్ లైఫ్ పార్టనర్స్ కావాలని కోరుకునేవారు కూడా కోకొల్లలు. కానీ తనకు అసలు లవ్, డేటింగ్ ఆలోచనే లేదంటోంది కియార.

నేహా ధూపియా ఆన్‌లైన్ చాట్ షో ‘నో ఫిల్టర్ నేహా’ కార్యక్రమంలో పాల్గొన్న కియార.. తను సింగిల్ అని క్లారిటీనిచ్చింది. యాక్టింగ్ కమ్యూనిటీ నుంచి ఎవరితోనూ డేటింగ్ చేయాలన్న ఆలోచన కూడా లేదని తెలిపింది. తనకు సింగిల్‌గా ఉండటం ఇష్టమన్న భామ.. మ్యారేజ్ అయ్యేంత వరకు సింగిల్‌గానే ఉండాలని నిశ్చయించుకున్నానని.. సో ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి సింగిల్ అని స్పష్టం చేసింది.

కాగా కియార, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed