కరణ్ కామెడీ టైమింగ్‌కు కియారా ఫిదా!

by Shyam |
కరణ్ కామెడీ టైమింగ్‌కు కియారా ఫిదా!
X

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇండస్ట్రీకొచ్చి అప్పుడే ఆరేళ్లు పూర్తయ్యాయి. బోల్డ్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ.. ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ మధ్య తను పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్లు.. కబీర్ సింగ్‌తో సూపర్ హిట్ అందుకున్న కియారా.. గుడ్ న్యూస్ చిత్రం ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌తో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది భామ.

కరణ్ జోహార్ డైరెక్షన్‌లో ‘లస్ట్ స్టోరీస్’ చేసిన కియారా.. ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలో చేయాలనుందని చెప్తోంది. తను ఈ మధ్య కరణ్‌ను పదే పదే కోరుతున్న విషయం కూడా ఇదేనని చెప్పిన భామ.. లవ్ స్టోరీస్‌కు బ్రాండ్ డైరెక్టర్ అయిన కరణ్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఆయన లవ్ బేస్డ్ సినిమాల్లోనూ కామెడీ ట్రాక్ చాలా బాగుంటుందని.. అందుకే తన డైరెక్షన్‌లో పూర్తి స్థాయి కామెడీ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పింది.

ఇక కెరీర్ విషయానికొస్తే ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన కియారా.. అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్‌లో నటిస్తోంది. ఇంకా కార్తీక్ ఆర్యన్ జోడీగా భూల్ బులైయా 2, సిద్ధార్థ్ మల్హోత్రాతో షేర్షా, ఇందూకి జవానీ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది.

Advertisement

Next Story