మా ఇద్దరిలో చెల్లే తెలివైనది: జాన్వీ

by Shyam |
మా ఇద్దరిలో చెల్లే తెలివైనది: జాన్వీ
X

జాన్వీ కపూర్.. అమ్మలోని అందం, నటనను వారసత్వంగా పుచ్చుకుని సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ తన తొలి సినిమా “ధడక్” రిలీజ్ కాకముందే తల్లి శ్రీదేవి చనిపోవడం చాలా బాధిస్తుంది అని చెప్తుంటుంది జాన్వీ. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుందని చెప్పే జాన్వీ.. చెల్లి ఖుషీ, తండ్రి బోనీ కపూర్ ఆ ఇద్దరే ప్రపంచంగా భావిస్తూ లాక్ డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయితే జాన్వీ, ఖుషీ లో చిన్న పిల్ల కాబట్టి ఖుషీ అల్లరి చేస్తుంది అనుకుంటారు కానీ అది తప్పు. మా ఇద్దరి విషయంలో రోల్స్ చేంజ్ అవుతాయి.. నేను పెద్దదాన్ని అయినా చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ అల్లరి చేస్తూ ఉంటే.. ఖుషీ మాత్రం బాధ్యతాయుతంగా, ప్రొటెక్టివ్ గా, తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని చెప్తుంది జాన్వీ. తను చాలా బాగా ఆలోచిస్తుంది అని .. ప్రతీ విషయంలో ఖుషీ బెస్ట్ అని చెప్తుంది జాన్వీ. ఈ మధ్య టిక్ టాక్ వీడియోలు చేస్తున్న ఖుషీ.. ఉదయం మూడు గంటలకు లేచి మేక్ అప్ వేసుకుని మరీ వీడియోలు చేస్తుందని .. ఇంకా కొద్ది రోజులు అయితే.. ఖుషీ గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ గా ఉందని చెప్తుంది.

ఇక జాన్వీ నటించిన గుంజన్ సక్సేనా, రూహీ అఫ్జా సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. గుంజన్ సక్సేనా VFX వర్క్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక దోస్తానా 2 సినిమా చిత్రీకరణ 40% పూర్తి అయిందన్న జాన్వీ.. సినిమాలు ఓటీటి లో రిలీజ్ అవుతాయో లేక థియేటర్ లో విడుదల అవుతాయో తనకు మాత్రం తెలియదు అంటోంది.

View this post on Instagram

How to annoy your sister 101 #quarantineedition 👯‍♀️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on May 8, 2020 at 4:56am PDT

Advertisement

Next Story

Most Viewed