పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు

by Anukaran |   ( Updated:2021-07-17 07:41:27.0  )
khairathabad-ganesh 2021
X

దిశ, ఖైరతాబాద్ : ప్రతి ఏడాది భిన్న రూపాలలో ప్రజలకు దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణనాథుడి ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి దర్శనం ఇవ్వనున్నారు. శనివారం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో గణపతి ఉత్సవ కమిటీ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నమూనా ను విడుదల చేశారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 40 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహా గణపతికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో కృష్ణ కాళి, కాలేశ్వరి జగన్మాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

స్వల్ప ఘర్షణ.….

మహాగణపతి నమూనా చిత్రాన్ని విడుదల చేసే కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంతో స్వల్ప ఘర్షణ నెలకొంది. స్థానిక నాయకుడు వేణు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సందీప్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. ఒక దశలో సహనం కోల్పోయిన వేణు సింగరి వంశస్థుడైన రాజ్ కుమార్ పై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పెద్దలు శాంతింప చేయడంతో సమస్య సద్దుమణిగింది.

Advertisement

Next Story

Most Viewed