వరల్డ్ రికార్డ్ సెట్ చేసిన ‘కేజీఎఫ్ 2’

by Anukaran |   ( Updated:2023-12-17 15:07:03.0  )
వరల్డ్ రికార్డ్ సెట్ చేసిన ‘కేజీఎఫ్ 2’
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ ఫుల్ టీజర్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. లీక్ కారణాల వల్ల చెప్పిన టైమ్‌ కన్నా ముందే వచ్చిన ‘కేజీఎఫ్ 2’ టీజర్.. ఎవరెన్ని వేషాలేసినా తనకున్న స్టామినా అస్సలు తగ్గదంటూ యూట్యూబ్‌లో అదరగొట్టేసింది. ఇంటర్నేషనల్ లెవల్‌ టీజర్‌కు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖుదోస్ చెప్పగా .. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్డ్ రికార్డ్ కొల్లగొట్టడంతో పాటు.. ప్రపంచంలోనే 3 మిలియన్ లైక్స్ సాధించిన ఫాస్టెస్ట్ టీజర్‌గా రికార్డ్ సెట్ చేసింది. ప్రస్తుతం 50 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతున్న టీజర్.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంది. హాలీవుడ్ లెవల్ టేకింగ్‌తో మాస్టర్ పీస్‌గా అదరగొట్టేసిన టీజర్‌లో యశ్ పవర్ ఫుల్ లుక్, హై వోల్టేజ్ యాక్షన్.. వరల్డ్ మూవీ రికార్డ్స్‌ను సైతం బ్రేక్ చేసేందుకు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కేవలం రెండు నిమిషాల టీజర్‌తోనే గూస్‌బంప్స్ తెప్పించిన ‘కేజీఎఫ్ 2’ .. థియేటర్స్‌లో రెండున్నర గంటలు చూస్తే .. ఎలా ఉంటుంది? సీన్ సీన్‌కు ఓ యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌‌ ఇస్తుంది కదా అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story
null