- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ మండలం ఇందిరానగర్‌లో జరిగే దళిత బంధు సభను అడ్డుకొని తీరుతామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల కుటుంబాలు ఉన్నాయని, దళిత బంధు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది.. ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదని, అందుకే దళిత జాతి సోదరులు ముఖ్యమంత్రి మాయలో పడవద్దని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ, మోసపూరిత వాగ్దానాలని, ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశానని చెబుతున్న మీరు ఎంతమందికి, ఎవరికి ఇస్తున్నారో ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అబద్ధపు వాగ్దానాలు అన్నీ మానుకోవాలని, కేసీఆర్ చేసేదంతా మోసమని, నీ మాయలో ఎవరు పడరని, హుజరాబాద్‌లో మీ పార్టీ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఈనెల 18వ తేదీన తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ చేతిలో పోలీసులు ఉన్న కారణంగానే అందరినీ అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, పత్తి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.