దళిత బంధు సర్వే.. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రులు

by Sridhar Babu |
దళిత బంధు సర్వే.. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రులు
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్‌లు ప్రశంసించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళిత బంధు సర్వే, దళిత బంధు అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని 12,521 మంది లబ్ధిదారుల అకౌంట్‌లల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మిగితా లబ్ధిదారుల అకౌంట్‌లల్లో కూడా వేగంగా దళిత బంధు డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. దళిత బంధు డబ్బులు అకౌంట్‌లో జమ అయిన అందరికీ.. సెల్ ఫోన్‌లో తెలుగులో సందేశం రేపో, ఎల్లుండో పంపించాలని సూచించారు.

దళిత బంధు సర్వేలో డోర్ లాక్ ఉన్న, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినవారు, తప్పిన పోయిన దళిత కుటుంబాల ఇండ్లను కూడా ఈ నెల 12 వ తేదీ నుంచి వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో రీ – వెరిఫికేషన్ చేయాలని మంత్రులు నిర్ణయించారు. 18 సంవత్సరాలలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవత దృక్పథంతో వెంటనే దళిత బంధు పథకం మంజూరు చేసి, వారికి కూడా డబ్బులు జమచేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed