- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మీరు మారిపోయారు సార్’.. కరీంనగర్‌లో ఆశ్చర్యపరిచిన కేసీఆర్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌లో మార్పు వచ్చిందా.? ‘దళితబంధు’ కార్యక్రమంలో వినూత్నంగా వ్యవహరించారేంటీ.? అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వైవిధ్యంగా వ్యవహరించారని అనుకుంటున్నారు ప్రత్యక్ష్యంగా చూసిన వారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి అందరితో కలిసి భోజనం చేద్దామని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమావేశానికి హాజరైన వారందిరితో కలిసి భోజనం చేద్దామని సీఎం చెప్పడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో జిల్లాల్లో పర్యటించినప్పుడు సీఎం కొంతమందిని మాత్రమే అనుమతించి భోజనం చేసేవారు.
సభలు, సమావేశాలు జరిగిన చోట సీఎంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలోకి వెల్లి లంచ్ చేసేవారు. కానీ, ఈసారి మాత్రం సమావేశానికి వచ్చిన వారందరితో కలిసి భోజనం చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. గతంలో ఇలాంటి పద్దతి ఉండేది కాదని, ఇప్పుడు సీఎంలో మార్పు వచ్చందని, ఆ మార్పునకు కారణం ఏంటా అని గుసగుసలాడుకున్నారు. ఈ మార్పు తాత్కాలికమేనా లేక శాశ్వతమా అన్నదే భవిష్యత్తులో తెలుస్తుందని అని చర్చించుకున్న వారూ లేకపోలేదు.