కారులో మహిళా కార్యకర్తను వివస్త్రను చేసి.. వీడియోలు తీసిన అధికార పార్టీ నేత అరెస్ట్

by Sumithra |   ( Updated:2021-12-02 22:17:46.0  )
CPIM-1
X

దిశ, వెబ్ డెస్క్: అధికార పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై స్థానిక నేత లైంగిక దాడికి పాల్పడి.. అదంతా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని తిరువల్లకు చెందిన స్థానిక అధికార పార్టీ నేత మహిళా కార్యకర్త పట్ల దారుణంగా ప్రవర్తించాడు. బాధిత మహిళను కారులో ఎక్కించుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. ఆ తర్వాత కారులోనే ఆమెను వివస్త్రను చేసి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదంతా కూడా వీడియో తీసి.. దానితో ఆమెను బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే, నిందితులు స్థానిక అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతోనే కేసు విచారణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. వెంటనే వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫోన్‌లో వచ్చిన మెసేజ్ చూసి తండ్రి షాక్.. అసభ్యకరమైన వీడియోలో తన కూతురు

Advertisement

Next Story