టాప్‌ ప్లేస్‌లో 'మిస్ ఇండియా'

by Shyam |
టాప్‌ ప్లేస్‌లో మిస్ ఇండియా
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందిన సెలెబ్రిటీ. ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కీర్తి నటనకు ఇండియా వైడ్‌గా అభిమానులున్నారు. భాష ఏదైనా సరే..సబ్ టైటిల్స్ ఫాలో అయిపోయి కీర్తి సినిమా చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కీర్తి ట్విట్టర్‌ చిట్ చాట్‌లో కూడా అన్ని రాష్ట్రాలకు చెందిన ఫ్యాన్స్ పాల్గొన్నారు. అందరికీ కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.

చాట్‌కే అంత రెస్పాన్స్ వస్తే.. కీర్తి సినిమా రిలీజ్ అయితే, ఎంత రెస్పాన్స్ ఉండాలి మరి. అందుకే ఈ మధ్య నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన కీర్తి సురేశ్ మిస్ ఇండియా సినిమా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరి ప్రేక్షకుల ఆదరణతో రేసులో నంబర్ వన్‌లో ఉంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ టాప్‌టెన్ సినిమాలను ప్రకటించగా.. అందులో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తానికి మిస్ ఇండియా రివ్యూ ఎలా ఉన్నా సరే..ప్రేక్షకులు మాత్రం కీర్తి సురేశ్ నటనను ఆస్వాదించేందుకే సినిమా చూస్తున్నారని చెబుతున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story