‘మిస్ ఇండియా’ ఆమె కథేనా?

by Shyam |   ( Updated:2020-11-07 05:20:41.0  )
‘మిస్ ఇండియా’ ఆమె కథేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వెండితెరపై ‘బయోపిక్’ల కాలం నడుస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సినిమా ఆశించనంత విజయం సాధించనప్పటికీ కీర్తి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సంగతి పక్కనబెడితే, అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూర్ బ్రూక్ ఎడ్డీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారనే విమర్శలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

‘చాయ్’ అంటే ఇష్టపడనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాము చాయ్ లవర్స్‌ అని చెప్పుకోవడాన్ని క్రేజీగా ఫీలవుతుంటారు. మరి అంతగా ప్రేమించిన చాయ్ కోసం ఏమైనా చేయగలరా? చేస్తున్న జాబ్ వదిలిపెట్టి చాయ్ బిజినెస్ పెట్టగలరా? అంటే.. ‘నో’ అనే సమాధానమే వస్తుంది. కానీ కొలరాడోకు చెందిన అమెరికన్ లేడీ బ్రూక్ ఎడ్డీ.. 2002లో ‘సోషల్ జస్టిస్ మూవ్‌మెంట్’ కోసం ఇండియాకు వచ్చినపుడు ఇక్కడి చాయ్ టేస్ట్‌కు ఫిదా అయిపోయింది. తిరిగి అమెరికా వెళ్లాక, అక్కడ తనకు ఇండియన్ చాయ్ టేస్ట్ దొరకలేదు. దాంతో స్వయంగా ఆమె ‘భక్తి చాయ్’ పేరుతో చాయ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అందులో సూపర్ సక్సెస్ సాధించి.. తన బిజినెస్‌ను ఏడాదికి రెండు వందల కోట్ల టర్నోవర్‌కు చేర్చింది. ‘భక్తి చాయ్’ సామ్రాజ్యానికి అధినేతగా అంతటా ప్రశంసలు అందుకుంది. ఇంచుమించు మిస్ ఇండియా కథ కూడా ఇలాగే ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు నరేంద్ర నాథ్ గనుక బ్రూక్ ఎడ్డీ స్ఫూర్తితో ఈ కథ రాసుకుంటే మాత్రం.. ఆమెకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సినిమా కాపీ అంటూ.. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడతున్నారు.

ప్రేక్షకులు ఒకప్పటిలా లేరు. ఇప్పుడు ప్రతీ సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ సీన్ కాపీ కొట్టారో, ఏ ట్యూన్ ఎక్కడి నుంచి లేపేశారు క్షణాల్లో పట్టేసి ఏకి పారేస్తున్నారు. అప్పట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అఆ’ సినిమాను యుద్ధనపూడి నవల ఆధారంగా తీసిన ‘మీనా’కు కాపీ అని విమర్శలు చేశారు. మొన్నటి మొన్న థమన్ ట్యూన్లు ‘రాక్షసన్’ మూవీకి కాపీ అని తిట్టిపడేశారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌లో అగ్నిపర్వతం పేలిపోయే సీన్లు ఎక్కడి నుంచి యథాతథంగా వాడుకున్నాడో క్లియర్‌గా చూపించి మీమ్స్ చేశారు. అందుకే దర్శకులు సినిమాలు తీస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement

Next Story