- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటుందో.. అక్కడ రోగాలుండవ్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటుందో… అక్కడ రోగాలుండవ్ అని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం పది గంటలకు… పది నిమిషాలు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. తన నివాస ప్రాంగణంలోని గార్డెన్ లో పూల కుండీలు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోకా భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, జెడ్పీటీసీ జీవన్ రెడ్డి, ముత్యంరెడ్డి, తదితులున్నారు.