- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్‌కు కేసీఆర్ రుచి చూపించేది ఇదేనా?
దిశ, హైదరాబాద్ బ్యూరో: ప్రపంచ దేశాలో సంపన్న దేశమైన అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యాటనలో 36 గంటలు గడపనున్నారు. రెండోవ రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందుకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కూడా ఆహ్వానం అందడంతో ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మొదట కేసీఆర్ ట్రంపు విందుకు వెళతాడా! అన్న అనుమానాలు వచ్చినప్పటికీ.. ట్రంప్ కోసం ప్రత్యేకంగా కేసీఆర్ నాటుకోడి పకోడి చేయిస్తుండడంతో ఢిల్లీ టూర్‌కు రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. గిఫ్ట్ ఇవ్వడం వరకేనా! రాష్ట్రం గురించి ట్రంప్‌తో ఏమైనా చర్చిస్తారా.. అన్న విషయంపై రాష్ర్ట ప్రజానీకం ఆసక్తిగా ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండో రోజు రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ర్టపతి భవన్‌లో ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి కొంతమంది ముఖ్య మంత్రులను మాత్రమే ఆహ్వానించడంతో పలు అనుమానాలను రెకెత్తిస్తున్నాయి. ఆహ్వానితుల్లో బీజేపీకి సన్నిహితంగా ఉన్న రాష్ర్టాలు బిహార్, ఒడిశా, కర్ణాటకలతోపాటు మహారాష్ర్ట, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యుహం ఏంటో అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటిస్థితితో కేంద్ర ప్రభుత్వం ట్రంప్‌కు ఇస్తున్న విందు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారా అన్న సందేహాలు వచ్చినప్పటికీ కేసీఆర్ ఏకంగా ట్రంప్‌కు తెలంగాణ రుచి చూపించాలని నాటుకోడి పకోడి కూడా రెడీ చేయిస్తుండడం గమనార్హం. కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పకోడీ ఇవ్వడమేనా.. పలకరించేది ఉందా!
ట్రంప్ విందుకు వెళుతున్న కేసీఆర్ నాటుకోడి పకోడి రుచి చూపించడం వరకేనా! లేక అమెరికాలో ఉన్న తెలంగాణ విద్యార్థుల గురించి ట్రంప్‌తో ఏమైనా మాట్లాడతారా అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల, ఉద్యోగుల వీసాలపై కేసీఆర్ ట్రంప్‌తో మాట్లాడివారి సమస్యలను తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. దేశంలో రెండో రాజధానిగా పేరుప్రఖ్యాతలు పొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో అమెరికా పారిశ్రామిక రంగాలు పెట్టుబడులు పెట్టే విధంగా ట్రంప్‌తో కేసీఆర్ ఏమైనా మాట్లాడేనా అనే అంశం కూడా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడవచ్చని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ ట్రంప్‌కు తెలంగాణ నాటుకోడి పకోడి రుచిచూపించి వెనుదిరుగుతారా! లేక రాష్ర్టానికి ఏమైనా మేలు జరిగే అంశాలపై మాట్లాడుతారా.. ట్రంప్ వద్ద కేసీఆర్‌కు మాట్లాడే అవకాశం దొరుకుతుందా! అనేవి తేలాల్సి ఉంది.
Read Also..