- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ బైపోల్.. కేసీఆర్ ప్రచార సభకు ముహూర్తం ఫిక్స్
దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల మేరకే ఈ సభ నిర్వహించేందకు కసరత్తులు చేస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా సీఎం సభ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ హుజురాబాద్ వరకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను హుజురాబాద్ లో కాకుండా పొరుగునే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హుజురాబాద్, ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై ఉన్న పెంచికల్ పేట్ సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ లు సభా ప్రాంగణ స్థలం పర్యవేక్షించారు. పెంచికల్ పేట శివార్లలోని సుమారు 8.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.
అయితే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన జనాన్ని సమీకరించినప్పటికీ వాహనాలకు పార్టీ జెండాలు పెట్టకుండా తరలించే యోచనలో ఉన్నారని సమాచారం. దుబ్బాక ఎన్నికలప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటన చేసినప్పటికీ అంతగా ప్రభావం పడలేదన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గమనించింది. హుజురాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్పీచ్ ప్రభావం ఖచ్చితంగా ఉండాలని భావించిన నాయకులు పెంచికల్ పేటను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఎప్పుడు ఉంటుందన్నది ఇంకా ఫిక్స్ కాకున్నప్పటికీ ఈ నెల 17 లేదా 27న ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.