- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చిల్లర రాజకీయం కేసీఆర్‌దే’
– మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో చిలర్ల రాజకీయం చేస్తున్నది ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. దమ్ముంటే ఈ రోజు యూనివర్సిటీలో అడుగుపెట్టి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాములు నాయక్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నాయకులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నది కేసీఆరే అని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ అని, ఇంట్లో వారికే పదవులు దక్కుతాయని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో మనవడికి కూడా పదవులు కట్టబెట్టినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని విమర్శించారు. కేసీఆర్ సీఎం కాకముందు ఆస్తులెన్ని? ఇప్పుడెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.
tags: Congress, ramulu nayak, kcr, university, uttam