- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల టార్గెట్‌గా కేసీఆర్ కొత్త వ్యూహం.. 80 మంది యువకులతో
దిశ, తెలంగాణ బ్యూరో : కొంతకాలం కిందట వరకు సోషల్ మీడియాను పట్టించుకోని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు దాన్నే కీలకంగా మల్చుకుంటున్నారు. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్‌తో గురువారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని సైతం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువనేతకు సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎడాపెడా అనుకూల వార్తలను సృష్టించడమే ఈ టీం లక్ష్యంగా దిశానిర్ధేశం చేశారు. మొత్తం 80 మంది యువకులతో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసి పూర్తి బాధ్యతలను అప్పగించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన యువనేతకు ఈ బాధ్యతలను అప్పగించారు.
బీజేపీ ఏది చేస్తే.. దానికి కౌంటర్
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందో.. అదే పంథాను టీఆర్‌ఎస్ కూడా అవలంభించనుంది. ఆ వార్తలను తప్పుడుగా చూపించడం, కౌంటర్ న్యూస్‌లను సృష్టించడమే ఈ టీం బాధ్యత. ప్రభుత్వ అనుకూలత కోసం పేపర్ల క్లిప్పింగ్‌లను సైతం విస్తృతంగా వినియోగించుకోనున్నారు. దీనికి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాలోని బృందాన్ని సైతం వాడుకుంటున్నారు. అవసరమైతే ఆయా పత్రికల ఫాంట్స్, నమూనాలతో ఈ టీం న్యూస్‌ను క్రియేట్ చేయనుంది. తద్వారా సదరు మీడియాలోనే వచ్చినట్లు చూపించనున్నారు.
బీజేపీ సోషల్ మీడియాకు బ్రేక్
ప్రస్తుతం బీజేపీ సోషల్ మీడియాలో చాలా బలంగా పని చేస్తుండటంతో ఇక నుంచి గులాబీ సోషల్ మీడియా దానికి బ్రేక్ వేయాలని అధిష్టానం ఆదేశిస్తోంది. టీఆర్‌ఎస్ వింగ్ సృష్టించిన న్యూస్‌ను వైరల్ చేయడం, ప్రచారం కల్పించేందుకు ఓ మీడియాలోని నెట్వర్క్ టీంను సైతం వాడుకోనున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఈ సోషల్ మీడియాలో గులాబీ సైన్యం, టీఆర్‌ఎస్ ఫాలోవర్స్ అంటూ వందల సంఖ్యలో గ్రూపులు నమోదయ్యాయి. బీజేపీ గ్రూపులను సైతం ఈ టీం వాచ్ చేస్తోంది.