- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ponnala Lakshmaiah: కేసీఆర్ ఆఖరికి వెళ్లేది జైలుకే…
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎ కేసీఆర్ ఆఖరికి వెళ్లేది జైలుకేనని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. చర్లపల్లి జైల్ కి వెళ్తారు అనుకున్న .. కానీ వరంగల్ లో కొత్త జైల్ కట్టుకుంటున్నారని అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆత్మగౌరవ పోరాటంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఆ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో పాలన కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయిందని ఆరోపించారు.
ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా పడటంతోనే తెలంగాణలో, దేశంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కేసీఆర్ కొత్తగా నీళ్లు ఇచ్చి… సాగులోకి వచ్చిందేమీలేదని దుయ్యబట్టారు. నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని, కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీయే కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నియమకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేసిన హామీలు ఏమయ్యాయని ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ ఏదన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బాగుపడలేదని… కేసీఆర్ ఫాం హౌజ్ బాగుపడిందని తెలిపారు. ప్రగతి భవన్ బాగుందని.. కానీ కొత్త సెక్రటేరియట్ వస్తే కానీ అడుగులు వేయరట అని వ్యాంగ్యాస్త్రాలు చేశారు.
పార్టీ నష్టపోతుందని తెలిసి…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసి కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని పొన్నాల అన్నారు. ఆత్మగౌరవం, స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిందన్నారు. ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.