- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఆర్సీ : అసెంబ్లీలో కేసీఆర్ సంచలన ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. అదే విధంగా పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఉద్యోగులతో ప్రభుత్వం ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇచ్చామన్నారు. గతంలో 43 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని సీఎం గుర్తుచేశారు. కరోనాతో 11వ పీఆర్సీ ఆలస్యమైందని, అయినా మెరుగైన రీతిలో వేతన సవరణ చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న చిరుద్యోగుల వేతనాలను కూడా పెంచారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, విద్యావలంటీర్లు, సెర్ప్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏఓలందరికీ రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. వేతన సవరణతో పాటుగా పదోన్నతుల ప్రక్రియ కూడా చేపట్టామన్నారు. అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతుల ప్రక్రియను మొత్తం పూర్తి చేస్తామన్నారు. పదోన్నతుల తర్వాత ఏర్పాటయ్యే ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిపై ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌కు 75 నుంచి 70 ఏండ్లకు తగ్గిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదనపు ప్రధానోపాద్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నామన్నారు. స్పౌస్ కేసుల విషయంలో కూడా త్వరలోనే ప్రక్రియ చేపట్టుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకువచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. కేజీబీవీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడాని 180 రోజుల సెలవులను ప్రకటిస్తున్నామన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ స్కీంను వర్తింప చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. పీఆర్సీ కింద 12 నెలల బకాయిలను చెల్లిస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌తో ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంచుతున్నామనరు. పదవీ విరమణ పెంపును 61 ఏండ్లకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.