- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబయి ముందుకు.. రాత మారని ఈస్ట్ బెంగాల్
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తిలక్ మైదాన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీపై ముంబయి సిటీ ఎఫ్‌సీ 2-0 తేడాతో విజయం సాధించింది.మొదటి నుంచి ముంబయి జట్టు దూకుడుగా ఆడింది. 38వ నిమిషంలో ముంబయి ఆటగాడు విగ్నేష్ గోల్ సాధించాడు. ఆ తర్వాత ఇరు జట్లు మొదటి అర్దభాగంలో మరో గోల్ చేయలేదు. రెండో అర్దభాగంలో ముంబయి ఆటదాడు ఫాంద్రే 59వ నిమిషంలో రెండో గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి చేర్చాడు. మ్యాచ్ ముగిసే వరకు ఇరు జట్లు మరో గొల్ చేయలేకపోయారు. దీంతో ముంబయి జట్టు హైదరాబాద్‌పై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఆదివారం డబుల్ ఫైట్‌లో జరిగిన రెండో మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈస్ట్ బెంగాల్ ఇంకా ఖాతా తెరవలేకపోయింది. టాస్ గెలిచి ఈస్ట్ బెంగాల్ జట్టు కిక్ చేయడానికి నిర్ణయించకుంది. దూకుడుగా ఆడిన ఈస్ట్ బెంగాల్ 13వ నిమిషంలోనే గోల్ చేసింది. బకరే కోన్ గోల్ చేసి మొదట్లోనే ఈస్ట్ బెంగాల్‌కు ఆధిక్యత తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఈస్ట్ బెంగాల్ తొలి విజయం అందుకుంటుందని అనుకుంటుండగా.. రిఫరీ పెంచిన ఇంజ్యురీ టైంలో జీక్సన్ సింగ్ కేరళ తరపున గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈస్ట్ బెంగాల్ ఇంత వరకు విజయం సాధించలేదు. మరోవైపు కేరళ బ్లాస్టర్స్‌కు ఇదే తొలి విజయం.