- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ చానల్‌తో భారీగా ఆదాయం.. యూట్యూబర్ కాజీ టిప్స్
దిశ, ఫీచర్స్: అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ‘యూట్యూబ్’ ఒకటి. ఎంతోమంది ప్రతిభావంతులు కొత్తగా యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి, తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపిస్తుండగా.. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రతీ గంటకు సుమారు 30,000 గంటల కొత్త కంటెంట్ అప్‌లోడ్ అవుతోంది. ఇక వీక్షకుల సంఖ్య పెరగడంతో.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ మధ్య పోటీతో పాటు ఒత్తిడి కూడా పెరిగింది. అయితే యూట్యూబర్‌గా పూర్తిస్థాయి కెరీర్‌ను ఎంచుకునేందుకు, మంచి ఆదాయాన్ని పొందేందుకు ఈ ఫ్రీ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఇండివిడ్యుయల్ క్రియేటర్స్, ఇతరత్రా బ్రాండ్స్ తమను తాము మార్కెట్ చేసుకుంటూ ఆదాయాన్ని పొందేందుకు ప్రత్యామ్నాయంగా మారింది. కానీ కొంతమంది యూట్యూబర్స్ మాత్రం తమ చానల్ ద్వారా డబ్బులు సంపాదించడంలో ఫెయిల్ అవుతుంటారు. అయితే యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదంటున్న స్టార్ యూట్యూబర్ హుస్సేన్ కాజీ.. అందుకోసం టిప్స్ అందిస్తున్నాడు.
హుస్సేన్ కాజీ.. తన యూట్యూబ్ చానల్ ‘కాజీ అఫీషియల్’(Kazzy Official) ద్వారా ఫేమస్ అయ్యాడు. మిస్టరీ వీడియోలు, ప్రత్యేకమైన చాలెంజెస్‌తో పాటు తన సంగీతంతో ఉర్రూతలూగించే కాజీ, యూట్యూబ్ ప్రారంభించిన మూడో నెలలోనే 25వేల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాడు. కెనడా సంపన్న యూట్యూబర్లలో కాజా ఒకడు కాగా, ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ 1 నుంచి 2 మిలియన్ డాలర్లు. ఇదేకాక అన్‌అఫీషియల్‌గా మరికొన్ని పాపులర్ యూట్యూబ్ చానెల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న కాజీ, యూట్యూబ్‌లో కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు.. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అంటున్నాడు.
యాడ్ సెన్స్ ఇంపార్టెంట్..
2019లో యూట్యూబ్ 15.15 బిలియన్ డాలర్ల యాడ్ రెవెన్యూ అందుకుంది. ‘మనం ఓ వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు, కంపెనీ దానిపై యాడ్స్ ప్రదర్శిస్తుంది. ఆ ప్రకటనల ద్వారా మనం డబ్బు సంపాదించాలంటే.. తొలిగా మానిటైజేషన్ పూర్తి చేయాలి. ఇందుకోసం చానెల్ ప్రారంభించిన ఏడాదిలోపు 1,000 మంది సబ్‌స్క్రైబర్ మార్క్‌ను చేరుకోవడంతో పాటు 4 వేల వాచ్ హవర్స్ పూర్తి చేయాలి. ఒక మంచి వీడియోతో దీన్ని సాధించవచ్చు. యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు ఆర్జించే ముందు, ప్రకటన మార్గదర్శకాలకు లోబడి వీడియోలు చేయాలి. యాడ్‌సెన్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకొని, ప్రకటన ఆదాయాలకు మద్దతుగా వీడియోలను సమర్థవంతంగా ఆప్టిమైజ్ చేయాలని గుర్తుంచుకోవాలి.
అఫిలియేట్ మార్కెటింగ్ :
యాడ్ సెన్స్ ద్వారా మాత్రమే కాదు, అఫిలియేట్ మార్కెట్ ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని పొందొచ్చు. ఉదాహరణకు వీడియోలను అన్‌బాక్సింగ్ చేయడం, ఉత్పత్తులను సమీక్షించడం, కంటెంట్‌లోనే తెలివిగా ప్రొడక్ట్ ప్రమోషన్ చేయడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు. ఇంటరాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలగాలి. మనం ప్రమోట్ చేసే లేదా విశ్వసించే బ్రాండ్‌తో వారిని కనెక్ట్ చేయాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే.. మన ఫాలోవర్స్‌కు ఆ బ్రాండ్‌ను సిఫార్సు చేస్తున్నాం.
సెల్ యువర్ ప్రొడక్ట్స్
ఒకవేళ మనకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటే, మనమే ఓ బ్రాండ్ క్రియేట్ చేసి వాటిని ప్లాట్‌ఫామ్‌లో విక్రయిస్తే సరి. ఫాలోవర్స్ తప్పకుండా ఆ బ్రాండ్‌తో అసోసియేట్ అవుతారు.
ఇది మనకో కొత్త వ్యాపార మార్గానికి ఉపయోగపడటంతో పాటు మనలోని సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది. ఆడియెన్స్‌తో మరింత కనెక్ట్ కావడానికి ఈ మెథడ్ సూపర్‌గా పనిచేస్తుంది.
ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి..
యూట్యూబ్‌లో డబ్బు ఆర్జించడం లాభదాయకం అయితే పేమెంట్స్ స్వీకరించడానికి యూట్యూబ్ ‘కమ్యూనిటీ గైడ్‌లైన్స్‘ పేరుతో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది. అందులో సేవా నిబంధనలు, కాపీరైట్, గూగుల్ యాడ్ సెన్స్ ప్రోగ్రామ్ సంబంధిత పాలసీలున్నాయి. ప్రతి ఒక్కరినీ వారి కంటెంట్‌తో డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ అనుమతించదు. పైగా రివ్యూ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. చానెల్ థీమ్, ఎక్కువగా వీక్షించిన వీడియోలు, సరికొత్త వీడియోలు, బిగ్గెస్ట్ ప్రపొర్షన్ ఆఫ్ వాచ్ టైమ్, మెటాడేటా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. – కాజీ