క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ కట్ చేయించుకున్న హీరోయిన్..

by Shyam |
koushika
X

దిశ, సినిమా : హీరోయిన్స్, ఆర్టిస్టులకు హెయిర్ ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. అందంగా కనిపించేందుకు ఫేస్, బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారో హెయిర్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే ఇదేమీ పట్టించుకోని టెలివిజన్ యాక్ట్రెస్ కవితా కౌశిక్ క్యాన్సర్ రోగుల కోసం తన వెంట్రుకలను దానం చేసింది. ఈ క్రమంలో సెలూన్‌లో హెయిర్ కట్ చేయించిన వీడియో షేర్ చేసిన భామపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనలాంటి మంచి హృదయానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. కాగా ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ అయింది.

https://www.instagram.com/reel/CWIfz1Wo72Y/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story