డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లో కవిత జన్మదిన వేడుకలు

by Shyam |
డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లో కవిత జన్మదిన వేడుకలు
X

Category : Latest/Telangana/main

దిశ, న్యూస్ బ్యూరో :నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ఛాంబర్‌లో ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమెను డిప్యూటీ స్పీకర్ తన ఛాంబర్‌కు ఆహ్వానించారు. అప్పటికప్పుడు కేక్‌ను సిద్ధం చేయించి కవిత చేతుల మీదుగా కట్ చేయించారు. అనంతరం ఆమెకు పద్మారావుతో పాటు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాసగౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సాధనలో జాగృతి పోషించిన పాత్ర, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ, బోనాల పండుగలకు ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు కవిత చేసిన కృషిని పద్మారావుగౌడ్ గుర్తుచేశారు.
tags : Telangana, Assembly, TRS, Ex-MP Kavita, Birthday, Deputy Speaker, Cake
slug : kavitha birthday celebrations in deputy spekar chamber

Advertisement

Next Story