- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్.. కేసీఆర్ నుంచి గుడ్ న్యూస్
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు కన్ఫామ్ అయింది. సాయంత్రం అధికారికంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే ఈ జాబితాలో ఉన్నవారికి ముందుగానే పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందిస్తున్నారు. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డికి అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు కొద్దిసేపటి క్రితం అందాయి. దీంతో ఆయన మంగళవారం ఉదయం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
హుజూరాబాద్ లోని తన క్యాడర్ కు కౌశిక్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కోరారు. ముందుగా కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో సామాజిక సేవకుడిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపారు. కానీ కౌశిక్ రెడ్డిపై పలు కేసులు ఉండటంతో పాటు సామాజిక సేవ అందిస్తున్నారన్న విషయంలో స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ ఎమ్మెల్సీ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదం తెలపలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.