కత్రినా పెళ్లి వీడియో లీక్.. ఎంత అందంగా ఉందో!

by Shyam |   ( Updated:2023-08-29 05:52:33.0  )
katrina
X

దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లి గురించి దాదాపు రెండు నెలలుగా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. మొత్తానికి త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కాబోతుండగా.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో మ్యారేజ్ జరగబోతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయకపోవడం విశేషం. ఈ క్రమంలో కత్రినా పెళ్లి వీడియో లీక్ అయిందంటూ ఓ క్లిపింగ్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా కనిపిస్తుండగా.. ఓ జ్యువెలరీ అడ్వర్టయిజ్‌మెంట్‌ అని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ క్యాట్ మోస్ట్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందంటూనే.. మరీ విక్కీ ఎక్కడా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో గురించి పక్కన పెడితే బాలీవుడ్ మోస్ట్ సీక్రెట్ వెడ్డింగ్‌గా పిలవబడుతున్న విక్కీ-క్యాట్‌ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు అంటూ.. వీరిద్దరి మార్ఫింగ్ పిక్స్‌ను కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed