సౌత్‌ స్టార్‌తో కత్రినా రొమాన్స్..

by Shyam |
సౌత్‌ స్టార్‌తో కత్రినా రొమాన్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరో సౌత్ ప్రాజెక్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతితో ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాకు సైన్ చేసిన భామ.. ఇప్పుడు మరో సౌత్ హీరోతో స్క్రీన్‌ రొమాన్స్ చేయనుంది. ‘లైగర్’మూవీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ‌కు రీల్ లైఫ్ లవ్‌గా కనిపించనుంది. ‘లైగర్’ షూటింగ్ జరుగుతుండగానే కొరటాల శివ, సుకుమార్‌లతో మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఈ రెండింటిలో ఒక మూవీకి ఫిమేల్ లీడ్‌గా కత్రినా సెలెక్ట్ అయినట్లు సమాచారం. మేకర్స్ ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చేందుకు కత్రినాను చూజ్ చేసుకున్నారని తెలుస్తుండగా.. ప్రస్తుతం కత్రినా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ఫోన్‌ బూత్’ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. దీంతో పాటు మరో సూపర్ ఉమెన్ మూవీ కోసం కసరత్తు చేస్తోంది భామ.

Advertisement

Next Story