- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గృహ హింస .. ఏళ్ల తరబడి మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. లాక్ డౌన్ లో ఈ సమస్య రెట్టింపు అయింది. రోజు రోజుకూ పెరుగుతున్న గృహ హింస కేసుల పరిష్కారం కోసం ఎన్నో NGO లు పనిచేస్తున్నాయి. వీటిలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న స్నేహ అనే NGO సంస్థకు విరాళాలు ఇచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపిద్దాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.
ఈ క్రమంలోనే ఫాతిమాగా మారి తన గొంతు వినిపిస్తోంది కత్రినా. ఎంతో మంది మహిళలు గృహ హింసతో నరకం అనుభవిస్తుండగా.. వారి గొంతుకలు వినిపిస్తూ పోరాటానికి సిద్ధం కావాలని కోరుతోంది. ఈ సమస్య పరిష్కారంలో మీరు భాగస్వామ్యం కావాలని .. స్నేహ సంస్థకు విరాళాలు అందించి స్నేహ హస్తం అందించాలని కోరుతోంది కత్రినా. తద్వారా గృహ హింసతో బాధ పడుతున్న మహిళలకు విముక్తి కలిగించాలని రిక్వెస్ట్ చేస్తోంది. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ లో @snehamumbai_official పై క్లిక్ చేసి .. ఆ పేజీలో ఒక పేరును ఎంచుకుని.. ఆ పేరుతో మీ చిత్రాన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. బయోలోని లింక్ ద్వారా విరాళాలు అందించి గృహ హింసకు వ్యతిరేకంగా మీ గొంతు వినిపించాలని కోరుతున్నారు కత్రినా. ఒక మహిళగా నా ప్రయత్నం నేను చేస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపింది.