కోర్టు మ్యారేజ్ చేసుకోనున్న బాలీవుడ్ జంట

by Shyam |   ( Updated:2021-11-24 05:12:27.0  )
katrina
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ త్వరలో ఒక్కటి కాబోతున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ జంట రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుండగా.. తాజాగా మరో న్యూస్ బయటికొచ్చింది. రాజస్థాన్‌లో వెడ్డింగ్‌కు ముందే ఈ జంట.. ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంటే నవంబర్ లాస్ట్ వీక్‌లో పెళ్లి అయిపోతుండగా.. రాజస్థాన్‌లో సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా కళ్యాణం జరగనుందని విక్కీ అండ్ క్యాట్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ప్రస్తుతం విక్కీ తాను కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తిచేసే పనిలో ఉండగా.. విక్కీ బ్రదర్ సన్నీ కౌశల్, మదర్ వీణా కౌశల్‌తో పాటు కత్రినా పెళ్లికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చూసుకుంటున్నారని తెలుస్తోంది.

చైతు బర్త్‌డేకు సమంత పర్సనల్‌గా మెసేజ్ చేసిందా?

Advertisement

Next Story