- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రినా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. అక్కడే విందు, అతిథుల లిస్ట్ రెడీ
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌లో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో కత్రినా సబ్యసాచి లెహంగా ధరించనుందని, వెడ్డింగ్ వెన్యూగా రాజస్థాన్‌ను సెలక్ట్ చేశారని, అతిథుల లిస్ట్ కూడా రెడీ అయిపోయిందని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది క్యాట్. ఓ ఎంటర్‌టైన్మెంట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. 15 ఏళ్లుగా పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు వింటూనే ఉన్నానన్న భామ.. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని చెప్పింది. నెలకు ఒక్కసారైనా ఇలాంటి న్యూస్ వింటున్నానని తెలిపింది. కాగా క్యాట్.. విక్కీ కౌశల్ ‘సర్దార్ ఉదమ్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు అటెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ టైమ్‌లో తన ఓన్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు ఎంత హడావిడి చేస్తుందో అలాగే చేసిందని, గెస్ట్‌ల ఇన్వైటింగ్‌లోనూ అలాగే ప్రవర్తించిందని సమాచారం.