బహుజన ఆడబిడ్డను గెలిపించుకుందాం : కత్తి కార్తీక

by Shyam |
బహుజన ఆడబిడ్డను గెలిపించుకుందాం : కత్తి కార్తీక
X

దిశ, గజ్వేల్: దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని చెల్లపూర్‌ గ్రామం మూడో వార్డులో అల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి కార్తీక బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ౩వ వార్డులోన ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తనను గెలిపిస్తే అధికారంలోకి రాగానే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను కోరారు.

‘బహుజన ఇంటి ఆడబిడ్డను మనమే గెలిపించుకుందాం’ అంటూ నినాదమిచ్చారు. మన ఓట్లను మనమే వేసుకుందాం. మీ యొక్క అమూల్యమైన ఓటును సింహం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. బహుజనులందరూ ఏకమై సింహం గుర్తుకు ఓటేసి కత్తి కార్తీకను అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story