కరోనాను జయించిన కరుణ్ నాయర్

by Shiva |
కరోనాను జయించిన కరుణ్ నాయర్
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా క్రికెటర్ కరుణ్ నాయర్(Team India cricketer Karun Nair) కరోనాను పూర్తిగా జయించాడు. తాను చేసిన తొలి సెంచరీనే 306 పరుగులుగా మలిచి త్రిశతక(Triple Century) వీరుడిగా పేరు తెచ్చుకున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మాన్ మూడు వారాల క్రితం కరోనా బారిన పడ్డాడు. దీంతో వెంటనే 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌(Self Isolation)కు వెళ్లాడు.

అనంతరం ఆగస్టు 8న టెస్టులు చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది. కరుణ్‌కు కరోనా సోకినట్లు బీసీసీఐ(BCCI), ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌(IPL franchise Kings XI Punjab)కు తప్ప బయట ఎవరికీ తెలియదు. టీం ఇండియా జట్టు సభ్యుల్లో కరోనా బారిన పడిన మొదటి వ్యక్తి కూడా కరుణ్ నాయరే(Karun Nair) కావడం గమనార్హం.

ప్రస్తుతం కరుణ్ బెంగళూరులోని శిబిరం(Bangalore Camp )లో ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ కోసం త్వరలోనే యూఏఈకి కూడా కరుణ్ వెళ్లనున్నట్టు కింగ్స్ ఎలెవెన్(Kings XI Punjab) స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే విమానం బెంగళూరులో కరుణ్‌ను ఎక్కించుకొనే వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.

కాగా, అంతకన్నా ముందు 24గంటల్లోపు రెండు సార్లు కరుణ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష(RT PCR Test) చేయించుకోనున్నాడు. దాంట్లో నెగెటివ్ వస్తేనే యూఏఈ వెళ్లే వీలుంటుంది. ఇక టెస్టుల్లో భారత్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడిన నాయర్ ఒక ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌ మొదట్లో ఢిల్లీకి ఆడిన కరుణ్ గత మూడేళ్లుగా పంజాబ్‌కు ఆడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed