41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ఫైనల్‌లో ఆసీస్ ప్లేయర్

by Shyam |
Barty,-Pliskova
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించింది. గురువారం రాత్రి సెంటర్ కోర్టులో జరిగిన సెమీ ఫైనల్‌లో మాజీ చాంపియన్ ఆంజిలిక్ కెర్బర్‌పై 6-3, 7-6 (7-3) తేడాతో విజయం సాధించి వింబుల్డన్ ఫైనల్ చేరింది. 41 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఎవానీ గూలగోంగ్ వింబుల్డన్ ఫైనల్ చేరిత తర్వాత మరో ప్లేయర్ ఫైనల్ చేరలేదు. 1980లో గూలగోంగ్ చివరి సారిగా ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆష్ బార్టీ కనుక విజేతగా నిలిస్తే గూలగోంగ్ తర్వాత వింబుల్డన్ చాంపియన్ అయిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించనున్నది. ఆష్ బార్టీకి ఇది తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం గమనార్హం.

మరో సెమీ ఫైనల్‌లో 2వ సీడ్ అరీనా సబలెంకకు 8వ సీడ్ ప్లిస్కోవా షాకిచ్చింది. సబలెంక తొలి సెట్ గెలిచిన తర్వాత ఆటలో పుంజుకున్న ప్లిస్కోవా వరుసగా రెండు సెట్లు తన ఖాతాలో వేసుకుంది. 5-7, 6-4, 6-4 తేడాతో సబలెంకపై విజయం సాధించి కరోలినా ప్లిస్కోవా ఫైనల్ చేరింది. శనివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ ఆష్ బార్టీతో తలపడనున్నది.

Advertisement

Next Story

Most Viewed