- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jpc: వన్ నేషన్ వన్ ఎలక్షన్ జేపీసీ గడువు పొడిగింపు.. ఆమోదం తెలిపిన లోక్ సభ

దిశ; నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై చర్చించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పోస్ట్ పోన్ చేశారు. పదవీ కాలాన్ని పొడిగించాలని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి (PP Chowdary) లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనిని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. ప్రతిపాదిత చట్టంపై భారీగా నిపుణులతో చర్చించాల్సి ఉందని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది. దీంతో కమిటీ పదవీ కాలాన్ని పొడిగించినట్టు తెలుస్తోంది. మరోవైపు 39 మందితో కూడిన జేపీసీ కమిటీలో సభ్యుడైన వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేయగా ఆయన స్థానంలో కొత్త సభ్యుడికి చోటు కల్పించినట్టు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది.
కాగా, గత ఏడాది లోక్‌సభలో ఒక దేశం ఒక ఎన్నిక కోసం129వ రాజ్యాంగ సవరణ బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. డిసెంబర్ 12న ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ బిల్లులను ఆమోదించింది. అయితే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. 39 మంది సభ్యులతో కూడిన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. వీరితో పాటు, మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, మనీష్ తివారీ, ప్రియాంక గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 27 మంది లోక్‌సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.