- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ,నెక్కొండ : ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు మనస్థాపంతో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం పిట్టకాలుబోడు తండాకు చెందిన ధరావత్ గణేష్ (సిద్దు) (22) సుమారు నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం విషయంపై గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల వారికి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపం చెందిన గణేష్ ఈనెల 20వ తేదీన గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు అదే రోజు నర్సంపేటలోని ఓ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story