కరోనా వార్నింగ్.. మహారాష్ట్రను క్రాస్ చేసిన కర్నాటక

by Shamantha N |
కరోనా వార్నింగ్.. మహారాష్ట్రను క్రాస్ చేసిన కర్నాటక
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రను కర్నాటక దాటేసింది. మహారాష్ట్రలో 37,236 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నాటకలో నేడు 39,305 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా బెంగళూరులోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్, బెడ్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో బెంగళూరుకు 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ చేరుకుంది. కర్నాటకకు ఈ స్థాయిలో ఆక్సిజన్ అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

Next Story