- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక బ్యాంక్ నిర్వహణ లాభం 93 శాతం వృద్ధి
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసికంలో కర్ణాటక బ్యాంక్ నికర లాభం రూ. 196 కోట్లుగా ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 175 కోట్లతో పోలిస్తే ఈసారి 12 శాతం అధికం. కాగా, నిర్వహణ లాభం రూ. 350 కోట్ల నుంచి 93 శాతం వృద్ధితో రూ. 677 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు వెల్లడించింది. ఇక, నికర వడ్డీ ఆదాయం ఏడాదికి 8 శాతం పెరిగి రూ. 395 కోట్ల నుంచి రూ. 555 కోట్లకు చేరుకుంది. జూన్ 30 నాటికి కర్ణాటక బ్యాంక్ వార్షిక టర్నోవర్ 3.89 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 1.26 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన క్రితం త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 4.82 శాతం ఉండగా, ఈసారి 4.64 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 3.08 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గాయి.
Advertisement
Next Story