జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ధనుష్ సినిమా.. ఎందుకో తెలుసా..?

by Shyam |
జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ధనుష్ సినిమా.. ఎందుకో తెలుసా..?
X

దిశ, సినిమా : ధనుష్ హీరోగా మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్ణన్‌’.. తాజాగా జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. గత ఏప్రిల్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా.. కలెక్షన్ల పరంగానే కాకుండా, కథ పరంగా కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయగా భారీ ఆదరణ పొందింది. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టీవీ చానెల్లో టెలికాస్ట్‌ కాగా.. ఏకంగా 9.4 టీఆర్పీ రేటింగ్‌ను ఈ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది ‘కర్ణన్’.. కాగా చిత్రాన్ని అక్టోబర్ 12 నుంచి 14వ తేదీల్లో జర్మన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో జరిగే న్యూ జనరేషన్‌ ఇండిపెండెంట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను.. జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story